దేశంలో క‌రోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న 2,380 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్లలో 13,433 మంది చికిత్స తీసుకుంటున్నార‌ని వివ‌రించింది. 

క‌రోనా నుంచి నిన్న 1,231 మంది కోలుకున్నారని, ఇప్పటి వ‌ర‌కు కోలుకున్న వారి మొత్తం సంఖ్య మొత్తం 4,25,14,479గా ఉందని పేర్కొంది. నిన్న క‌రోనా వ‌ల్ల 56 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మృతుల సంఖ్య మొత్తం 5,22,062కి పెరిగింద‌ని పేర్కొంది. కరోనా పని అయిపోయినట్లేనని అనుకుంటున్నా సమయంలో మహామమ్మరి మళ్ళీ బుసలు కొట్టడం ఆందోళనకు కల్గిస్తోంది. సరిగ్గా విద్యార్థులకు పరీక్షాల సమయం దగ్గర పడుతోన్న్న సమయంలో కరోనా వ్యాప్తి అధికం అవుతుండటం విద్యార్థులు , తల్లిదండ్రులు ఆందోళనను రేకెత్తిస్తోంది. అదే సమయంలో పరీక్షలు ఉంటాయా..? లేదా మళ్ళీ వాయిదా పడుతాయా..? అనే సస్పెన్స్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోన కేసులు ఓ మోస్తరు సంఖ్యలో నమోదు అవుతోన్నప్పటికీ రోజురోజులు గడిచే కొద్ది పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, పెరుగుతోన్న కరోనా కేసులతో మళ్ళీ ఆంక్షలను విధించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా నిబంధనలను పాటించేలా ఆదేశాలు జారీ చేయాలనీ భావిస్తోంది.