ఇది మా ఫ్యామిలీ వివాదం : మంచు విష్ణు
మంచు ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తండ్రీకొడుకులు మోహన్‌బాబు, మనోజ్ ఒకరికపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దాంతో మంచు మనోజ్, మంచు మోహన్‌బాబు నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పహాడిషరీఫ్ పోలీసులు మంగళవారం రెండు కేసులు నమోదు చేశారు. మోహన్‌బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్, అతని భార్య భూమా మౌనికపై 329, 351(బీ.ఎన్.ఎస్ ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే మనోజ్ ఫిర్యాదు మేరకు మోహన్‌బాబు అనుచరులపై 329, 351, 115(బీ.ఎన్.ఎస్) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంచు విష్ణు దుబాయి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. జల్‌పల్లిలోని ఇంటికి వెళ్లే మార్గమధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని, త్వరలోనే అన్నీ పరిష్కారం అవుతాయని విష్ణు అన్నారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని ఆయన తెలిపారు.
Share this article in your network!