తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఘ‌న్ పార్క్ వ‌ద్ద అమ‌రుల‌కు నివాళులు అర్పించి, గాంధీ భవన్ లో మరియు పరెడ్ గ్రౌండ్ లో పాల్గొన్నారు.

4 కోట్ల ప్రజల ఆకాంక్షను 1200 మంది విద్యార్థుల ప్రాణత్యాగాలు చూసి చలించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీ లు అమలు చేశాం. ప్రగతి భవన్ ఎదుట ఉన్న కంచెను తొలిగించినం. ప్రజలు కష్టాలు తెలుసుకోవడానికి ప్రగతి భవన్ గేట్లు తెరిచి ఉంచాం. తెలంగాణ జీవనశైలి స్వేచ్ఛం, బానిసత్వాన్ని తెలంగాణ భరించలేదని మంత్రి సీతక్క అన్నారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ ప్రజల తత్వమని పేర్కొన్నారు. మా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు తొలి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. సంక్షేమం ముసుగులో తెలంగాణను చెరబట్టాలని చూస్తే సమాజం సహించదని తెలిపారు. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టి ప్ర‌జ‌ల‌కు చెరువు అవుతున్నామ‌ని అన్నారు.  

ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుందని చెప్పారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వలన్నదే ఈ ప్రభుత్వ ప్రాధాన్యత అని అందరి సలహాలు, సూచనలు స్వీకరించి, చర్చించి ముందుకెళ్తామన్నారు

తమ నిర్ణయాలను, లోటుపాట్ల సమీక్షకు అవకాశమిస్తున్నామని ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామన్నారు. మీడియాకు స్వేచ్ఛకు స్వేచ్ఛ‌ని, ఇందిరాపార్కులో ధర్నాకు అనుమతి ఇచ్చామని తెలిపారు. సచివాలయాల్లోకి సామాన్యుడు ప్ర‌వేశాన్ని క‌ల్పించామ‌ని, ప్రగతి భవన్​ మహాత్మా జ్యోతిబాపూలే భవన్​గా పేరుమార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. జ్యోతిబాపూలే భవన్​లో మంగళ, శుక్రవారాల్లో ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌పై దరఖాస్తులు తీసుకుంటున్నామని తెలిపారు.