2024 ఏపీ రాజకీయ ఎలక్షన్..ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయి అంటున్న ..రాజకీయ విశ్లేషకులు...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లారు.వీరిద్దరూ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతోపాటు బీజేపీ కూటమిలో చేరిక, ఈ నెల ఏడో తేదీన ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో చోటు చేసుకోబోయే పరిణామాలు తదితర వాటిపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ తొలి జాబితాలో ఐదు సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 సీట్లకు సంబంధించిన అభ్యర్థులు ప్రకటన, అక్కడ ఎదురవ్వబోయే ఇబ్బందులు వంటివి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన అడిగిన స్థానాలు, వాటిలో తెలుగుదేశానికి ఉన్న ఇబ్బందులపైనా ఇరువురు నేతలు మాట్లాడుకుంటున్నారు.జనసేనకు ఇవ్వాల్సిన 19 స్థానాల్లో సుమారు ఆరేడు స్థానాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నట్టు చెబుతున్నారు. ఆయా స్థానాల్లోనే జనసేనకు బలమైన నేతలు ఉండడంతో ఇరు పార్టీల అగ్రనేతలు వీటిపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలోనే మిగిలిన 19 స్థానాలకు పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తారా..? ఢిల్లీ పర్యటన తరువాత ఆ మేరకు ప్రకటన ఉంటుందా..? అన్నది చూడాల్సి ఉంది.
రెండో జాబితాపైనే ఇద్దరి నేతల మధ్య చర్చలు జరగుతున్నట్టు తెలుస్తోంది.ఆశవహుల్లో మొదలైన టెన్షన్….ఏది ఏమైనా తొమ్మిదో తేదీ నాటికి రాష్ట్రంలోని కూటమి సీట్ల పంపకాలపై ఒక స్పష్ట వచ్చే అవకాశముంది. ఈలోగానే జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుందా..? లేదా..? అన్నది చూడాలి. బీజేపీకి ఇచ్చే సీట్లపైనా కూటమిలో చర్చ జరుగుతోంది. పది ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలను బీజేపీ కోరుతున్నట్టు చెబుతున్నారు. మరి చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తారో చూడాల్సి ఉంది.
మరోవైపు ఈ పొత్తులపై చర్చించేందుకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఢిల్లీ వెళ్లారు. ఏపీలో పొత్తులపై నేతల అభిప్రాయాలు, షీట్ల వ్యవహారాలు, పోటీకి సన్నద్దతపై చర్చించబోతున్నారు. ఆమెతో మాట్లాడిన తర్వాత రేపు ఎల్లుండి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ని కూడా ఢిల్లీకి పిలిపించి పొత్తుల ఎపిసోడ్‌కు ఎండ్ కార్డు వేయాలని చూస్తోంది బీజేపీ.
Share this article in your network!