పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన పెంచుకోవాల‌ని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి మ‌రియు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క అన్నారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌ష్క‌రించుకొని మహాత్మా జ్యోతి రావు పూలే ప్రజా భవన్ లో ఆమె మొక్క‌ల‌ను నాటారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతూ.. జీవించడానికి మన పర్యావరణం చాలా ముఖ్యమైనద‌ని అన్నారు. వాతావరణ అనుకూలంగా ఉండే విధంగా పర్యావరణం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం అని అన్నారు. అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను నివారించడానికి వివిధ నివారణ చర్యలను కూడా చేప‌ట్టాల‌ని సూచించారు. అప్పుడ‌ప్పుడు మొక్కలు నాటి ప‌ర్య‌వ‌ర‌ణ ర‌ణ‌లో భాగ‌స్వాములు కావాల‌ని కోరారు. గ్లోబల్ వార్మింగ్ త‌గ్గించుకోవ‌డం కోసం పర్యావరణాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం, మనుగడకు, భ‌విష్య‌త్తు తరాలకు ప్రాథమిక అవసరం అని ఆమె గుర్తు చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు , విద్యార్థులకు మొక్కలు నాటి పాఠ‌శాల వాతావ‌ర‌ణంలో ప‌చ్చ‌ద‌నాన్ని నెల‌కొల్పాల‌ని అన్నారు.