టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. వర్మపై నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. వర్మపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఘటనలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.. దీంతోపాటు సినిమా పోస్టర్లపై అనకాపల్లి, తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లలో వర్మ మీద కేసులు నమోదు కాగా.. తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.