ప్రతి విద్యార్ధి జీవితంలో మ్యాథ్స్ సూత్రాలను పాటించాలి
మ్యాథ్స్ డే సందర్భంగా సికింద్రాబాద్, మల్కాజగిరిలోని గౌతమ్ మోడల్ స్కూల్ లో మ్యాథ్స్ డే కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి మల్కాజగిరి డివిజన్ కార్పోరేటర్ శ్రవణ్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రవణ్ పలు తరగతుల విద్యార్థిని, విద్యార్థులు తయారుచేసిన సైంటిఫిక్ పరికరాలను పరిశీలించి వారితో ముచ్చటించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు చూపించిన సృజనాత్మకత చాలా గొప్పగా ఉందని, నిజజీవితంలో మ్యాథ్స్ సూత్రాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో విద్యార్థులు తెలుసుకుంటే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అనిత రెడ్డి, ఇంచార్జ్ రమణ, లక్ష్మి మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Share this article in your network!