బీజేపీ 12 సీట్లు గెలవబోతుంది : ఈటల
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీని అభిమానించే లక్షల మంది అభిమానులు, అనేక సంఘాల నాయకులు నిరంతరంగా ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా, ఏమున్నా లేకున్నా కష్టాలు వచ్చినా కూడా... ఆ కష్టాలకు ఓర్చి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారిని మళ్లీ ప్రధాని ని చేయాలన్నటువంటి స్లోగన్ పునికిపించుకున్న తెలంగాణ ప్రజానికం ఎక్కడికక్కడ వాళ్లకు వాళ్లే పట్టు పట్టి జుట్టు గట్టి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్న తరుణంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
అమిత్ షా గారు తొలి మీటింగ్ లో 17 సీట్లలో 12 సీట్లు బిజెపి గెలవబోతుందని చెప్పారు. ఇవాళ చూసిన పరిస్థితిని బట్టి తూచా తప్పకుండా 12 సీట్లు పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది చెప్తున్నాను.రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న ప్రస్టేషన్లో వారు మాట్లాడిన మాట ఆక్షేపనీయంగా ఉంది. 2014లో కాంగ్రెస్ పార్టీ మోడీ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమవుతుందని ఏదైతే మాట్లాడారో ఆ మూర్ఖపు వాదన తప్పని తేలినా.. మళ్లీ అరిగిపోయిన రికార్డు 2024 లో కూడా ఆ మాట మాట్లాడటం ఆయన అజ్ఞానానికే నిదర్శనం అని భావిస్తా ఉన్నాం. ఇలాంటి అజ్ఞానపు మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడటం అనేది తగదు. తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాను.
Share this article in your network!