కర్నాటకలో సంపూర్ణ మెజారిటీ సాధించగలమనే విశ్వాసం ఉంది : అమిత్ షా
మే 10వ తేదీన 224 సీట్లు కలిగిన కర్నాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలలో సంపూర్ణ మెజారిటీ సాధించగలమనే విశ్వాసాన్ని కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రమైన కర్నాటకలో వరుసగా రెండవ సారి అధికారం చేజిక్కుంచుకోవడంతో పాటుగా ప్రభుత్వం ఏర్పాటుచేస్తామనే విశ్వాసం ఉందని ఆయన వెల్లడించారు. కర్నాటకలో ఎన్నికలకు ముందు లేదా తరువాత ఎలాంటి భాగస్వామ్యాలనూ భారతీయ జనతా పార్టీ (బీజెపీ) చేసుకోదని విస్పష్టంగా ఈ మాస్టర్ వ్యూహకర్త ప్రకటించారు.
‘‘కర్నాటకలో తాను తొమ్మిది రోజులు గడిపాను. రాష్ట్రంలో ఐదు ప్రాంతాలనూ సందర్శించాను. ఈ సందర్శనలో గమనించిన అంశాలతో, తాను పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాను… రాష్ట్రంలో పూర్తి మెజారిటీ సాధించగలము. ఇది మోదీ నాయకత్వంలో జరిగి తీరుతుంది. ఎలాంటి ఆందోళన చెందవసరం లేదు’’ అని షా, న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో ప్రేక్షకులకు ఆనందం కలిగిస్తూ వెల్లడించారు.
జెడీఎస్‌తో ఎలాంటి పొత్తులూ ఉండవని తేల్చి చెప్పిన షా, కర్నాటకలో 224 సీట్లకూ బీజెపీ సొంతంగా పోటీ పడుతుందని , ఎలాంటి పొత్తులనూ, ఏ పార్టీతోనూ రాష్ట్రంలో పెట్టుకోదని, గత ఎన్నికలలో సాధించిన 104 సీట్ల మార్కును మరింత మెరుగుపరుచుకోగలమనే నమ్మకంతో ఉన్నామన్నారు.
‘‘ఎలాంటి భాగస్వామ్యాలనూ , ఏ పార్టీతోనూ చేసుకోము’’ అని షా అన్నారు. లక్షలాది మంది కార్యకర్తలతో చర్చించిన పిమ్మట పార్టీ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుందని షా వెల్లడించారు. కాంగ్రెస్ మరియు జెడీఎస్‌లు ఇప్పటికే తమ తొలి జాబితా అభ్యర్ధుల పేర్లను వెల్లడించాయి.
ప్రధానమంత్రి మోదీకు వ్యతిరేకంగా పోరాడుతూ కర్నాటకలో కాంగ్రెస్ పోటీపడితే చాలని, దానికి మించిన గెలుపు సూత్రమేమీ బీజెపీకి లేదని కాంగ్రెస్ పార్టీని ఉద్ధేశించి వ్యంగ్యంగా షా అన్నారు.
‘‘ఒకవేళ వారు ఎన్నికలలో (కర్నాటక)లో పోటీపడుతూ మోడీ వర్సెస్ గాంధీ పోటీగా చెప్పుకున్నా మాకు అభ్యంతరం లేదు. నిజానికి బీజెపీకి దీనికి మించిన గెలుపు సూత్రం కూడా లేదు’’ అని షా , న్యూస్ 18 రైజింగ్ ఇండియా సదస్సులో వీక్షకుల నవ్వుల మధ్య చెప్పారు.
ఢిల్లీలో ఓ వర్గపు రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్‌లో కూడా అమిత్ షా లాంటి నాయకుని అవసరం ఉంది. అలాంటి నాయకుడు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం పొందగలుగుతుందని నమ్ముతున్నారు ; దీనికి తోడు కూరలో ఉప్పులా జాతీయ రాజకీయాలలో బీజెపీ బలంగా నాటుకు పోవడానికి గాంధీ (రాహుల్) ఇతోధికంగా సహాయపడ్డారని వారు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతి చోటా గాంధీ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ మిశ్రమ ఫలితాలు సాధించింది.
Share this article in your network!