*రూల్ అఫ్ రిజర్వేషన్స్ ఉల్లఘించి బీసీల నోట్లో మన్ను కొట్టి వాళ్ళ గొంతులు కోసే ప్రయత్నం చేస్తున్న కేంద్ర విధ్యాసంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల పాలక వర్గాలు 

*బీసీల రావాల్సిన పదవులని, హక్కులని హరిస్తున్న ఇఫ్లూ అధికారులు. 

*బీసీలకు రావాల్సిన పదవులు, హక్కులని హరిస్తున్న ఇఫ్లూకు సుప్రీం కోర్టు ఆదేశాలు. 

*బీసిల హక్కుల పోరాటంలో సుప్రీమ్ కోర్టు జోక్యం హర్షణీయం. 

*అడ్మిషన్లు, నియామకాల్లో బీసీలకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం ఆగదు 

*నేషనల్ ఓబిసి రెసెర్చ్ ఫెలోషిప్ ల సంఖ్య ను 10000 వరకు పెంచాలి. 

01.04.2022 

''అనేక కేంద్ర విధ్యాసంస్థలలో బీసీలకు అడ్మిషన్లు, నియామకాల్లో రూల్ అఫ్ రిజర్వేషన్స్, రాజ్యంగపరమైన హక్కులు పాటించకుండా బీసీల నోట్లో మన్ను కొట్టి వాళ్ళ గొంతులు కోసే అన్యాయం జరుగుతుంది'' అని ఆవేదన వ్యక్తం చేశారు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ (ఇఫ్లూ) యూనవర్షిటీలో పెద్ద ఎత్తున బీసీలకు అన్యాయం జరుగుతుందని, అక్కడి పాలక వర్గాల అక్రమాలని బట్టబయలు చేస్తూ.. కొన్నాళ్ళుగా న్యాయం పోరాటం చేస్తున్నారు దాసోజు. 

తొలుత బీసిలకు జరుగుతున్న అన్యాయాన్ని జాతీయ బీసీ కమిషన్‌ ద్రుష్టికి తీసుకువెళ్లారు దాసోజు. ఉద్యోగాలు, అడ్మిషన్లలో 27% ఓబీసీ కోటాను తుంగలో తొక్కడం, రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడంతో పాటు లాక్ డౌన్ కాలంలో ఆగమేఘాల మీద 58ఖాళీలను నోటీఫికేషన్లు విడుదల చేసి, చివరికి అప్లీకేరానీయకుండా, దొంగలు దొంగలు కలసి వూర్లు పంచుకున్నట్లుగా వ్యవహరిస్తూ, పదవులన్నీ తీసుకొని, కేవలం ఎనిమిది పోస్టులు బీసీలకు కేటాయించి పాలక వర్గాలు దుర్మార్గానికి పాల్పడిన సంగతిని బీసీ కమీషన్ కు వివరించారు. 

అలాగే మొత్తం 238 సాంక్షన్డ్ అధ్యాపకపోస్టులు ఉంటె, 63 పోస్టులలో బీసీలు ఉండాల్సిన వారు వుంటే కేవలం 25మంది మాత్రమే వుండి మిగతావి ఖాళీగా వున్న సంగతి నివేదించారు. 

అలాగే 238 శాంక్షన్ పోస్టులు వుంటే.. ఒక్క బీసి కూడా ప్రొఫెసర్ కాలేదని, దాదాపు 8మంది బీసి ప్రొఫెసర్లు, 17 మంది అషోసియేట్ ప్రొఫెసర్లు బీసీలు వుండే అవకాశం వున్న చోట ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గమని వివరించారు. 

ఈ విషయంలో నేషనల్ బీసీ కమీషన్ తో కలసి ఇచ్చిన నోటీఫికేషన్ రద్దు చేసి, జరుగుతున్న ఇంటర్వ్యూలు నిలిపివేయాలని న్యాయపోరాటం చేస్తున్నారు దాసోజు. ఈ న్యాయపోరాటంలో తెలంగాణ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది ఇఫ్లూ. అయితే హైకోర్టు ఉత్తర్వులని ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టు వాజ్యం వేశారు దాసోజు. 

ఓబీసీ రిజర్వేషన్స్ కాపాడటం కోసం చేస్తున్న పోరాటం కోసం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ని పరిశీలించిన ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇఫ్లూకి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనంకు కృతజ్ఞతలు తెలిపారు దాసోజు. రాజ్యంగం కల్పించిన ఓబీసి రిజర్వేషన్ కాపాడుకునే పోరాటంలో ఇదో ముందడుగని పేర్కొన్నారు దాసోజు. అడ్మిషన్లు, నియామకాల్లో బీసీలకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం ఆగదని తెలియజేశారు దాసోజు. 

'ఇవాల్టి కూడా బీసిలు బానిసలుగా బ్రతుకుతున్నారు. అన్ని రకాల అణిచివేతకు గురి అవుతున్నారు. చట్ట సభల్లో యాభై శాతం బీసీలు ఉన్నట్లేయితే ఈ రోజు ఇలా చేతులు జోడించే దుస్థితి వుండేది కాదు. కాబట్టి చట్ట సభల్లో యాభై శాతం బీసీలు వుండే విధంగా పోరాటం చేయాలి'' అని పిలుపునిచ్చారు దాసోజు.