''భారత దేశంలో దాదాపు 40 లక్షల మంది కోవిడ్ బారిన పడి చనిపోయారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ఇవ్వడం భారత ప్రభుత్వానికి చెంపపెట్టు'' అని వ్యాఖ్యానించారు ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్.
 

'రాష్ట్రంతో పాటు దేశంలోని కరోనాతో లక్షల మంది చనిపోయారు. కానీ కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై తప్పుడు లెక్కలు చూపుతూ కోవిడ్ చావులని తక్కువ చేసి చూపించారు. ఇది నేరం. రాజ్యంగ ఉల్లంఘన. దిని వలన కరోనా బాదితులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని కూడా అందకుండా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ తరపున నెత్తిమీద నోరు పెట్టుకొని ఈ అంశాన్ని లేవనేత్తాం. కానీ కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు.'' అని పేర్కొన్నారు. 

'తెలంగాణలో దాదాపు లక్షమందికి పైగా కరోనాతో చనిపోయారని సహేతుకంగా గణాంకాలతో సహా నిరూపించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపానికి పోలేదు. తెలంగాణలో కోవిడ్ కారణంగా లక్ష మందికి పైగా మరణించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కోవిడ్ మరణాల సంఖ్య 4100 మాత్రమే అని నివేదించింది. డెత్ ఆడిట్ కమిటీ ఏర్పాటు చేసి చనిపోయనవారి సంఖ్యని సరిదిద్దండని కోరితే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో హై కోర్టుని ఆశ్రయించాం. కేసు ఇప్పటికీ పెండింగ్ లో వుంది. కోర్టులు, ప్రజలని తప్పు దోవ పట్టిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డంబికాలకు పోయి తప్పుడు లెక్కలు చూపిస్తున్నాయి. ఆక్సిజన్, బెడ్లు, మందులు దొరక్క ప్రజలు పిట్టలు మాదిరి రాలిపోయారు. చావులు నియత్రించలేకపోయారు. చనిపోయిన వారి సంఖ్యని కూడా చూపించకుండా ఘోరమైన తప్పిదానికి పాల్పడుతున్నారు. ఇది నేరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా డబ్ల్యుహెచ్వో ఇచ్చిన లెక్కలు ఒప్పుకొని చనిపోయిన వారందరికి న్యాయం చేయాలి'' అని కోరారు దాసోజు.