సావిత్రి భాయ్ పూలే వర్ధంతి సందర్బంగా గౌతమ్ నగర్ చౌరస్తా లోని సావిత్రి భాయ్ పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ . ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ పూలే ఆశయ సాధన కోసమే బీజేపీ ప్రభుత్వం పని చెస్తోందని అన్నారు. బాలికల విద్య, మహిళా సాధికారత కోసం సావిత్రి భాయ్ పూలే ఎంతో శ్రమించరన్నారు.ఈ రోజు నరేంద్రమోడీ సారద్యం లోని కేంద్ర ప్రభుత్వం సైతం మహిళా సాధికారత కోసం అనేక చర్యలు తీసుకుందన్నారు.ముఖ్యంగా బేటీ బచావో -బేటీ పడావో, ప్రధాన మంత్రి స్వనిది, మహిళా గ్రూప్ లకు వడ్డీ లేని రుణాలు బీజేపీ ఘనతనన్నారు. మహిళల ఆత్మగౌరవర్ధం 11 కోట్ల టాయిలెట్స్ స్వచ్చ భారత్ మిషన్ లో కట్టించారన్నారు. ముస్లిం మహిళల రక్షణ కోసం ట్రిపుల్ తలాక్ పై చెట్టం చేశారన్నారు.

ముద్ర లోన్స్, పి. ఎం. ఈ. జి. పి ద్వారా మహిళలకు భారీ సబ్సిడీ రుణాలు అందితున్నారు. ఈ దేశానికి మహిళలను రాష్ట్ర పతిగా, ఆర్ధిక మంత్రిగా చేసిన ఘనత మోడీదే అని అన్నారు . ఈ కార్యక్రమం లో బీజేపీ ఓబీసీ మోర్చా కన్వీనర్ కిరణ్, వితోభా, శ్రీనివాస్ ముదిరాజ్, బలరాం, వెంకట్ యాదవ్, వేణు గోపాల్ యాదవ్, బాలు, బాల్చేండర్, గన్న, రాకేష్, నర్సింహా చారీ, వెంకట కిషోర్, అనిల్, కిషన్ తదితరులు పల్గొన్నారు.