Saturday, June 20, 2026

మల్కాజిగిరిలో BLA-2 అవగాహన కార్యక్రమం.. పాల్గొన్న మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

Must read

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో BLA-2 (బూత్ లెవల్ ఏజెంట్) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినాయక్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన జోనల్ కమిషనర్ BLA-2 విధులు, బాధ్యతలు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. బూత్ స్థాయిలో ఓటర్ల జాబితా పరిశీలన, ఓటరు నమోదు, మార్పులు, సవరణలు వంటి అంశాలతో పాటు ఎన్నికల ప్రక్రియలో పాటించాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బూత్ స్థాయి ప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, BLA-2 ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!