Saturday, July 25, 2026

విభిన్న తాత్విక కథాంశంతో లఘు చిత్రం

Must read

మనుషుల జీవితంలో చోటుచేసుకునే సంఘటనల ఆధారంగా, విభిన్నమైన తాత్విక కథాంశంతో ఓ లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర దర్శకుడు దాసరి రవికుమార్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఆర్.వి. స్టూడియోస్, తేజు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయని ఆయన వెల్లడించారు.

ఈ చిత్రంలో సీనియర్ నటులు కొండపల్లి అప్పారావు, భాను, సుధాకరరెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని తెలిపారు. అలాగే రాక్ రాజేష్ డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన బాలనటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారని పేర్కొన్నారు.

చిత్రం తొలి షెడ్యూల్ చిత్రీకరణను గన్నవరం, పురుషోత్తంపట్నంలోని గాడ్ గ్రేస్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో విజయవంతంగా పూర్తి చేసినట్లు దర్శకుడు వెల్లడించారు.

ఈ చిత్రానికి పి.ఆర్.ఓగా శ్రీధర్ ఎస్.ఏ.టి., తత్వ సలహాదారుగా కొండపల్లి సేవలందిస్తుండగా, మాటలు, చిత్రానువాద బాధ్యతలను సుధాకరరెడ్డి.టి నిర్వహిస్తున్నారు. కథ, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, దర్శకత్వ బాధ్యతలను దాసరి రవికుమార్ స్వయంగా నిర్వహిస్తున్నారు.

ఈ చిత్రానికి ఎన్.వి. లక్ష్మీదేవి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రెండో షెడ్యూల్ చిత్రీకరణను త్వరలో పూర్తి చేసి, అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!