Friday, July 10, 2026

బీఆర్‌ఎస్ నిధులు, సింగరేణి పరిస్థితిపై కవిత ఘాటు విమర్శలు

Must read

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత బీఆర్‌ఎస్ ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు పేర్కొన్న రూ.1,400 కోట్ల నిధుల మూలాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఈ మేరకు సంబంధిత దర్యాప్తు సంస్థలు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరారు.

‘సింగరేణి బాయి బాట’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్రవ్యాప్తంగా సింగరేణి కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణే తన ప్రధాన ఉద్దేశమని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సమయంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తనను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ నిధులపై ఆమె పలు మాట్లాడుతూ బీఆర్​ ఎస్​ పార్టీ ఖాతాలో రూ.1,400 కోట్ల నిధులు స్వచ్ఛమైనవి కావని ఆమె ఆరోపించారు. అవి ‘క్విడ్ ప్రో కో’ తరహా లావాదేవీల ద్వారా సమకూరినవేనని పేర్కొంటూ, వాటి మూలాలను పూర్తిగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఆ విచారణలో అక్రమాలు బయటపడితే, ఆ నిధులను తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఉద్యమకారుల కుటుంబాల సంక్షేమానికి వినియోగించాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు.

“నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదు” అని ఆమె వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కూడా తెలంగాణ రక్షణ సేన ద్వారానే ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సింగరేణి సంస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిదని, వేలాది కుటుంబాలకు జీవనాధారమని కవిత పేర్కొన్నారు. అలాంటి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు అవసరమైన భద్రతా పరికరాలు, ఆధునిక మైనింగ్ సామగ్రి, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని సూచించారు.

అయితే బీఆర్‌ఎస్ పార్టీపై కవిత చేసిన ఆరోపణలపై ఆ పార్టీ నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. అలాగే పార్టీ నిధులకు సంబంధించిన ఆరోపణలు ప్రస్తుతం కవిత చేసిన రాజకీయ ఆరోపణలు మాత్రమే. వాటిపై సంబంధిత దర్యాప్తు సంస్థలు లేదా న్యాయస్థానాలు ఎలాంటి నిర్ధారణ చేయలేదు. సింగరేణి అంశాలపై కూడా ప్రభుత్వం లేదా సంస్థ యాజమాన్యం నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇరు అంశాలపై రాజకీయ చర్చ కొనసాగుతోంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!