పవన్ కళ్యాణ్, ఈ పేరుకి ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రేజ్ వేరు, ఎంతో మంది కేవలం ఆయన పేరు చెప్పుకునే బ్రతికేవారు ఉన్నారు, కానీ ఆయన రాజకీయ వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుంది,ఆయనకీ ఉన్న ముఖ్యమైన అవరోధాల గురుంచి మనం తెలుసుకుందాం. 

తన అన్న మెగాస్టార్ చిరంజీవి అండదండలతో సినీ జీవితంలోకి అడుగుపెట్టినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొని సినీ పరిశ్రమలో ఒక గొప్ప స్థాయికి ఎదిగారు. చిన్ననాటినుండే సామాజిక స్పృహ కలిగి ఉన్న పవన్ 2014 మర్చి 14వ తారీఖున తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తూ జనసేన పార్టీని ప్రకటించారు దాని తరువాత ఆ ఎన్నికలలో టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసినదే. 

ఆయన ఎక్కడ ర్యాలీలు చేసినా ఎక్కడ సభ పెట్టినా కూడా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు, కానీ పవన్ రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి ఆయనకు శాపంగా మారిన ఒక విషయం గురుంచి మనం చెప్పుకోవాలి. 

భారత దేశ రాజకీయాలలో ఎంత క్రేజ్ ఉన్నా ప్రముఖ పాత్ర పోషించేది మాత్రం ప్రజలు. పవన్ రాజకీయ సభలకు వచ్చే జనాలు ఓట్లు వేసినా కూడా జనసేన కొన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది కానీ ఓటు వేసే సమయానికి వచ్చేసరికి ఎవరికీ వారు ముందుకు,డబ్బులకు అమ్ముడుపోతున్నారు,అదీ కాక కుల మాయలో పడి సగం మంది వారికి ఎవరు ఉపయోగపడతారు అనేది చూడక వారి కులానికి చెందిన నాయకులనే గెలిపించుకుంటున్నారు. దీని వల్ల జరిగే నష్టాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. 

జనసేన పార్టీ సభలకు వచ్చేవారు ఎవరూ కూడా పవన్ కు ఓటు వేయరని మిగతా పార్టీలవారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పవన్ అభిమానులు కూడా ఆవేశంతో ఊగిపోకుండా ఒక్క ఓటు తమ జీవితంపై ఎంతటి ప్రభావం చూపిస్తుందనే విషయం ప్రతీ ఒక్కరు అవగాహన చేసుకోవాలి. అయితే అభిమానులే పవన్ కు ఒకరకంగా శాపంగా మారి ఆయన అనుకున్న మార్గానికి అవరోధంగా నిలుస్తున్నారని కొందరి భావన . 

ఇది ఒక రకంగా పవన్ అభిమానులకు కోపం తెప్పించినా ఇదే నిజం. కనుక రానున్న ఎన్నికలలో ఎటువంటి ఆవేశాలకు,కుల మాటలకు, డబ్బు, మందు వంటి వాటికి లోనవకుండా విజ్ఞతతో మన భవిష్యత్తుకు దోహదపడే నాయకులను ఎన్నుకుందాం.