ఉగాది దాకా ఎందుకు తక్షణమే ఎన్నికలు పెట్టండి..: బోండా ఉమా
ప్రజలతో సీఎం జగన్ కాళ్ల బేరానికి దిగాడని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. అలాగే రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు ఉండవని అంటున్న మంత్రి బొత్స సత్యనారాయణకు ఆయన సవాల్ విసిరారు.
రాబోయే ఎన్నికల్లో చీపురుపల్లిలో బొత్సను, విజయనగరంలో బొత్స తమ్ముళ్లు, కుటుంబ సభ్యులను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బొత్స కుటుంబంతో సహా సుమారు 50 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. మీకు అంత నమ్మకం ఉంటే ఉగాది దాకా ఎందుకు తక్షణమే ఎన్నికలు పెట్టాలని బొండా ఉమ సవాల్ చేశారు.
Share this article in your network!