తిరుమలతో ఆటలా? తప్పు జరిగితే ఒప్పుకోవాలి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలి సిందే. కాగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ది కార్యక్రమం నిర్వహించారు.
ఆలయం వద్ద మెట్లను శుభ్రం చేసి.. మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండి తుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమం అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భం గా వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో ఉన్న హిందువులే హేళనగా మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.
నా చిన్న తనం నుండి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్లం. మా కుటుంబం ఆంజనేయ స్వామికి పరమ భక్తులం. అన్ని మతాలను ఈ దేశం సమానంగా తీసుకుంది. వైసీపీలో హిం దువులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు. వైసీపీలో ఉన్న హిందువులే హేళనగా మాట్లాడుతున్నారు.
భూమన కరుణాకరరెడ్డి బాధ్యత తీసుకున్నప్పుడు దేవాలయంలో పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన తిరుమల వెళ్లి హైడ్రామా క్రియేట్ చేస్తున్నాడు. విచారణకు రావాలి అంటే వైవీ సుబ్బారెడ్డి రికార్డ్స్ కావాలి అంటున్నాడు.. మీరు రికార్డ్స్ మాకు ఇచ్చారా?..అంటూ పవన్ ప్రశ్నించారు.
సుబ్బారెడ్డి విచారణకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ధర్మారెడ్డి ఇష్టానుసారంగా ఎలా వ్యవహరించాడో నేను దర్శనానికి వెళ్ళినప్పుడు చూశా. ధర్మారెడ్డి అడ్రెస్సు లేడు.. ఇంత జరుగుతుంటే ఏమయ్యాడు అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
కొడుకు చనిపోతే నిబం ధనలకు విరుద్ధంగా తిరుమల కు వెళ్ళాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేను బ్లేమ్ చెయ్యడం లేదు.. తప్పు జరిగితే ఒప్పు కోవాలి కదా. తిరుమలతో ఆటలు ఆడతామా?.. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని పవన్ అన్నారు.
Share this article in your network!