రేవంత్ రెడ్డి పోలీసులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి : దాసోజు శ్రవణ్
అధికారంలోకి వస్తే పోలీసులను బట్టలు విప్పి కొడతానని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్. ఇది రేవంత్ రెడ్డి అనాగరిక, ఆటవి వైఖరికి నిదర్శనమని, ప్రజాస్వామ్య దేశంలో ఇంతటి భాద్యతరాహిత్యమైన మాటలు దురదృష్టకరమని పేర్కొన్నారు. రేవంత్ అసాంఘిక, నేరపూరిత ప్రవర్తనపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన డాక్టర్ దాసోజు శ్రవణ్.. రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్న చట్టవిరుద్ధమైన చర్యలు, హింసాత్మక బెదిరింపులపై ఏఐసీసీ నాయకత్వం ఎందుకు మాట్లడటం లేదని ప్రశ్నించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓ సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోలీసులను బట్టలు విప్పి కొడతానని పోలీసులను బెదిరించారు. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత దారుణం, అనాగరికం. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులను రేవంత్‌రెడ్డి బహిరంగంగా బెదిరించారు. ప్రజాస్వామ్య సమాజంలో కరుడుగట్టిన క్రిమినల్ మాత్రమే ఇలా ప్రవర్తిస్తాడు. తీవ్ర ఆందోళన కలిగించే విషయమేమిటంటే… రేవంత్‌రెడ్డికి ఇది అలవాటుగా మారి బెదిరింపు , బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలని పదేపదే చేస్తున్నాడని మండిపడ్డారు దాసోజు శ్రవణ్
గతంలోనూ రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, గౌడ, పిచ్చుకుంట్ల, యాదవ, నాయీబ్రాహ్మణులు, ట్రాన్స్‌జెండర్లు తదితర వర్గాలకు చెందిన వారిని కూడా బెదిరించారని, అవమానించారని గుర్తు చేసిన దాసోజు.. పోరేవంత్ రెడ్డి పోలీసులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
"కాంగ్రెస్ కుటుంబీకుడు, ఎంపీ రాహుల్ గాంధీ భారతదేశం అంతటా 'నఫ్రత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్' గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న విద్వేష రాజకీయాలకు రాహుల్ గాంధీ , AICC నిస్సందేహంగా మద్దతు ఇస్తున్నాయి. మానసిక రోగిలా మారిపోయి, నీచమైన పదజాలంతో నేరపూరిత బెదిరింపులకు పాల్పడుతూ రాజకీయ నైతికతను ఉల్లంఘిస్తున్న రేవంత్ రెడ్డి. కానీ ఏఐసీసీ నాయకత్వం రేవంత్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు’’ అని కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపారు.
ప్రేమని పంచుదామని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఒక విషయం తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ ఇప్పటికే తెలంగాణను అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా, సామరస్యంగా జీవించే 'మొహబ్బత్ కా బజార్'గా మార్చారు. రేవంత్ రెడ్డి ఇందులో నఫ్రత్ గా దుకాన్’ నడపాలని ప్రయత్నిస్తున్నారు. ఇది కాంగ్రెస్ కి బ్యాక్ ఫైర్ అవుతుంది రాహుల్ గాంధీ తెలుసుకోవాలి’’ అన్నారు దాసోజు.
రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షలు, కుళ్ళు, కుతంత్రాలతో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని ఎలా మార్చేశారో వివరిస్తూ.. "తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంతగా దిగజారిపోయిందంటే ఎన్నికల ప్రచారం కోసం 'తిరగబడదాం తరిమికొడదాం' అనే హింసాత్మక, అనైతిక , రాజ్యాంగ విరుద్ధమైన నినాదంతో ముందుకు వచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయిందా?" అని ప్రశ్నించారు దాసోజు
'అహింస', 'సత్యాగ్రహం' వంటి గాంధీ సిద్ధాంతాలని భరోసా ఇస్తున్న 125 ఏళ్ల కాంగ్రెస్ నాయకత్వం,, హింసాత్మక మార్గాల ద్వారా అత్యంత ప్రజాదరణ కలిగిన, ప్రజలకు స్నేహపూర్వకమైన నాయకుడైన కేసీఆర్‌ను గద్దె దించగలదని నమ్ముతోందా? తెలంగాణా ప్రజల నుండి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఎంత దూరమయ్యారో ఇదే రుజువుచేస్తోంది ” అన్నారు దాసోజు శ్రవణ్. రేవంత్ రెడ్డి యొక్క రౌడీ వ్యూహాలు కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని ఆపలేవని ఉద్ఘాటించారు.
“నఫ్రత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ ఖోలూంగా” అనే తన ప్రకటనను రాహుల్ గాంధీ నిజంగా విశ్వసిస్తే, ప్రతి ఒక్కరిపై తన హీనమైన, నీచమైన భాషతో నఫ్రత్ లేదా ద్వేషాన్ని చిమ్ముతున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.’’ అని డిమాండ్ చేశారు దాసోజు.
Share this article in your network!