సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్‌వీఎం కృష్ణారావు కన్నుమూత
సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సీహెచ్‌వీఎం కృష్ణారావు (64) కన్నుమూశారు. 47 ఏళ్ల జర్నలిజం కెరీర్‌లో ఆయన అంచలంచెలుగా ఎదిగారు. అంకితభావంతో వృత్తిలో రాణించారు. జర్నలిజానికే వన్నెతెచ్చారు. 1975లో ఒక స్టింగర్‌గా జర్నలిజంలో కెరీర్ ప్రారంభిచారు. ఆ తర్వాత ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేశారు. ఆంగ్ల , తెలుగు దినపత్రికలపై చెరగని ముద్ర వేశారు. డెక్కన్ క్రానికల్ న్యూస్ బ్యూరో చీఫ్‌గా సుదీర్ఘ కాలంగా పనిచేశారు. రాజకీయనేతలు, జర్నలిస్టులు కృష్ణారావును “బాబాయ్” అని ముద్దుగా పిలుచుకునేవారు. కృష్ణారావు నిశితమైన అంతర్దృష్టి, అలుపెరగని సత్యాన్వేషణ ఆయనకు పాత్రికేయల్లో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. విషాదకరంగా, గత ఏడాది క్యాన్సర్‌తో అతని పోరాటం చాలా త్వరగా ముగిసింది. కృష్ణారావుకు భార్య, కొడుకు, కుమార్తె మరియు ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు.
Share this article in your network!