ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు
తెలంగాణ వీణ , మల్కాజిగిరి : సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు మల్కాజిగిరి చౌరస్తా లో ఘనంగా జరిగాయి . మల్కాజిగిరి అసెంబ్లీ కన్వీనర్ సదానంద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సర్దార్ సర్వాయి పాపన్న ఎంతో కృషి చేశారని ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి తరం ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు . ఈ కార్యక్రమం లో వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యాలక్మి ,స్టేట్ ఎగ్జిక్యూటివ్ వి.కే.మహేష్ , వాసంశెట్టి శ్రీనివాస్, రామకృష్ణ ,ఆర్ కే శ్రీనివాస్, జి.హనుమంతరావు,సోమా శ్రీనివాస్ , లక్ష్మణ్,నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.
Share this article in your network!