ఏపీని హడావుడిగా విభజించారు : ప్రధాని మోదీ
పార్లమెంట్ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని మోదీ స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా భాగంగా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ విభజన తీరును తప్పుబట్టారు. ఏపీ, తెలంగాణ వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు.
Share this article in your network!