తిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌ రెడ్డి దర్శించుకున్నారు. సతీమణితో కలసి తిరుమలేశుని ఆశీస్సులు అందుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. 

కరోనాతో దెబ్బతిన్న పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. జమ్మూలో తితిదే ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడం సంతోషకరమన్నారు. పంచగవ్య ఉత్పత్తులు, గో రక్షణ చర్యలతో గోమాతపై గౌరవం పెరిగిందని తెలిపారు. అంతకు ముందు తిరుమలలోని పుష్పగిరి మఠం వద్ద జరిగిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహ వేడుకలో ఆయన పాల్గొన్నారు.