కేటీఆర్ మంత్రా ? బజారు రౌడీనా? : దాసోజు శ్రవణ్
*మంత్రి కేటీఆర్ సోయిలేకుండా మాట్లాడుతున్నారు. మంత్రి అనే స్పృహ లేకుండా కేవలం తిట్లు మాత్రమే చర్చలోకి వచ్చే విధంగా ప్రజా సమస్యలని పక్కన పెట్టి ఫస్ట్రేషన్ తో ఒక బజారు రౌడీ లా మాట్లాడుతున్నారు. కేటీఆర్ తిట్ల పురాణంలో మేము బాగస్వామ్యం అవ్వం. టీఆర్ఎస్ మోశాల్ని, వైఫల్యాలని ఎండగడతాం. అంకుశంలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం'
''ఒకపక్క భారత సైనికులని పొట్టన పెట్టుకొని భారతదేశాన్ని అక్రమయించాలని చైనా ప్రయత్నిస్తుంటే , మరోపక్క భారత ప్రభుత్వం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు దేశ ప్రజలు రెక్కల కష్టంతో కట్టిన డబ్బుని మేకిన్ ఇండియా పేరుతో దొడ్డిదారిలో చైనా కంపెనీలకు కోట్ల రూపాయిలు కట్టబడుతుంది. భారత ప్రభుత్వం దేశ ప్రజలకు చేస్తున్న ఈ దుర్మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాం'' అని పేర్కొన్నారు ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్
మెకిన్ ఇండియా ప్రుతో ఫేం టు పథకం ద్వారా జరిగే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అవినీతి జరిగింది. 2021 -22 ఫైనాన్సియల్ ఇయర్ లో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ లక్ష 40 వేల స్కూటర్ లు అమ్మేశారు. ఫేం టు పధకం నిబంధనలు అనుసరిస్తున్నమని, వాహనం ప్రతి విడిభాగం భారతదేశంలో తయారు చూస్తున్నామని చెప్పి 400 కోట్లు సబ్సీడీ కేంద్రం ఇచ్చింది. బ్యాటరీ తోపాటు చాలా పాట్స్ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నట్లు ఆధారాలతో గతంలో సహా బయటపెట్టాం. ఈ రోజు మళ్ళీ అదే ఫేం టు పాలసీలో చైనాకి సంబధించిన బెంలింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 11డిసెంబర్ 2018 గూర్గావ్ లో స్థాపించిన ఈ సంస్థ ఫేం టు నిబంధనలని తుంగలో తొక్కుతు 75కోట్ల రూపాయిలు సబ్సిడీ రూపంలో దోచుకుంది'' అని వెల్లడించారు దాసోజు.
బెంలింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 11డిసెంబర్ 2018 లో మొదలైయింది. ఇద్దరు చైనీయులు అమిత్ కుమార్ అనే ఒక భారతీయుడు ఇందులో బాగస్వామ్యం. ఫేం టు పాలసీ లో రిజిస్టర్ చేసుకున్నారు. దిని ప్రకారం వాహనం తయారికి కావాల్సిన భాగాలన్నీ ఇండియాలోనే తయారు కావాలి. ఒక స్కూటర్ తయారు చేసి మార్కట్ లో అమ్మితే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ దాదాపు 32 వేల రూపాయిలు. 2021 -22 ఫైనాన్సియల్ ఇయర్ లో బెంలింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 22వేల వాహనాలు అమ్మారు. అంటే దాదాపు రూ. 75కోట్ల రూపాయిలు ఈ కంపెనీ కొట్టేసింది. ఫేం టు పాలసీలో వాహనాల పార్ట్స్ వందశాతం ఇండియాలోనే తయారు అయ్యిండాలి. కానీ వంద శాతం పార్ట్స్ చైనా నుండి తెచ్చి ఇక్కడ అసెంబుల్ చేసి ఇక్కడ ఫేం టు పాలసీ కింద 75కోట్ల రూపాయిలు అప్పనంగా దోచుకుటుంటుంది'' అని ఆధారాలు మీడియాకు అదించారు దాసోజు.
''బెంలింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 25లక్షల మాత్రమే పెట్టుబడి పెట్టింది. చైనా నుంచి విడి భాగాలు తెచ్చి ఇక్కడ అసెంబుల్ చేసి అమ్మినందుకు 75కోట్లు సబ్సిడీ ఇచ్చింది ప్రభుత్వం. 25లక్షల పెట్టుబడి పెట్టిన కంపనీకి 75 కోట్ల రూపాయిలు సబ్సిడీ ఇస్తారా ? ఇదెక్కడి న్యాయం ? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రజలు డబ్బుని ఇంత అడ్డగోలుగా దారి మళ్ళిస్తారా ? అని నిలదీశారు దాసోజు.
''75 కోట్ల రూపాయిలు దొడ్డిదారిలో తీసుకోవడం కాకుండా రిలేటడ్ పార్టీ ట్రాన్జాక్సన్ కింద దొంగ్గున్ సిటీ డయు మోటార్ సైకిల్ కో లిమిటెడ్ అనే చైనాలో కంపెనీకి డబ్బుని తరలించే కుట్ర చేశారు. అడ్డగోలుగా దేశం డబ్బుని దోచుకొని విదేశాలకు తరిలించడం అతి పెద్ద ఆర్ధిక నేరం''అని వెల్లడించారు దాసోజు
ఇంతపెద్ద ఎత్తున స్కాములు జరుగుతుంటే సిబీఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్, డిపార్ట్మెంట్ అఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నాయి ? ఎందుకు ఈ తప్పిదాలని బయటకి తీసుకురావడం లేదు. అందరూ తెలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం అడ్డదారుల్లో ప్రజల సొమ్ముని కంపెనీలకు కట్టబడుతుంది. మెకిన్ ఇండియా ని ఫెకిన్ ఇండియా చేస్తుంది. మెకిన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా , ఫ్రాడింగ్ ఇండియా గా మార్చేశారు. ప్రజల సొమ్ముని అప్పనంగా దోచిపెడుతున్న ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విచారణ జరగాలి'' అని డిమాండ్ చేశారు దాసోజు.
111 జీవో కేసీఆర్ ఇంటి పంచాయితా ? ?
111 జీవోని ఎత్తివేసే విధంగా జీవో 69ని ఆగమేఘాల మీద తీసుకొచ్చారు సిఏం కేసీఆర్. గతంలో అసెంబ్లీలో మాట్లాడుతూ 111 జీవో ఎత్తేస్తాం కమిటీ రిపోర్ట్ వస్తుందని అన్నారు. ఆ రిపోర్ట్ ఏమయిందో తెలీదు. 111 జీవో కేసీఆర్ సొంత ఎస్టేట్ పంచాయితా ? Apex comitte రిపోర్ట్ ని తెలంగాణ సమాజం, అసెంబ్లీ వేదిక బహిర్గతం చేయకుండా సొంత ఇంటి వ్యవహారంలా జీవోలని తీసుకురావడం ఎంత వరకూ న్యాయం ? అని ప్రశ్నించారు దాసోజు.
''1,32,600 ఏకరాల భూమి111జీవో పరిధిలో వుంది. ఇందులో లక్ష ఎకరాలు టీఆర్ఎస్ పార్టీ చెందిన పెద్దలే బెదిరించి కొనుకున్నారు. ఇప్పుడు వారి మేలు చేస్తూ జీవోని ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ జీవో చదివితే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇంత దారుణమా ? భవిష్యత్ తరాలకు నీరు అందించే సరస్సులని మింగేసే ఆలోచన చేయడం దారుణం. అసలు ఈ జీవో అమలైతే పర్యావరణం, జలాశయాలని ఎలా కాపాడాలి ? మంచి నీరు అందించే సరస్సులని ఎలా రక్షించాలి ? మొత్తం విధివిధానాలు తయారుచేసి అమలు చేసిన తర్వాత జీవో ఎత్తివేత గురించి అలోచించాలి. కానీ రాత్రిరాత్రికే జీవో తెచ్చి సోమేశ్ కుమార్ సారధ్యంలో కమిటీ వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇంతకంటే తలకుమాసిన పరిపాలన విధానం మరొకటి వుండదు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీకి కొమ్ముకాసే వ్యక్తులు భూములు కొనుకున్నారు కాబట్టి ఈ రోజు అన్యాయంగా జీవోని తీసుకొచ్చారు. 69జీవో హై కోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్దం. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్దం కాబట్టి ఈ జీవో వెంటనే వెనక్కి తీసుకోవాలి'' అని డిమాండ్ చేశారు దాసోజు
కేటీఆర్ సోయిలేకుండా ఫస్ట్రేషన్ తో మాట్లాడారు :
మంత్రి కేటీఆర్ తాను మంత్రి అనే సోయి లేకుండా కేవలం తిట్లు మాత్రమే చర్చలోకి వచ్చే విధంగా ప్రజా సమస్యలని పక్కన పెట్టి ఫస్ట్రేషన్ తో పిచ్చి వాగుడు వాగుతున్నారు. ఒక బజారు రౌడీ లా మాట్లాడుతున్నారు. కేటీఆర్ అధికారంలో వున్నారు. ఒక పాలకుడిగా వున్నారు. మీ చేతిలో అధికారం వుంది. అధికారంతో ప్రజా సమస్యలు పపరిష్కరించాలి. కానీ తిట్ల పురాణాల రాజకీయం ఏమిటి ? మీ తిట్ల పురాణంలో మేము బాగస్వామ్యం అవ్వం. మీ మోశాల్ని, వైఫల్యాలని ఎండగడతాం . అంకుశంలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం'' అని వెల్లడించారు దాసోజు.
Share this article in your network!