బంజారా మహిళలతో కలిసి నృత్యం చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే...
దేశవ్యాప్తంగా తీజ్ ఉత్సవాలు గత కొన్నిరోజులుగా ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని పాటిమీది తండాలో గురువారం జరిగిన తీజ్ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బంజారా మహిళలతో కలిసి ఆడి పాడారు. మహిళలతో కలిసి చిందులేశారు.
ఇటీవలే నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో మహిళా మంత్రి సత్యవతి రాథోడ్ ఉత్సాహంగా పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. గిరిజన మహిళలతో కలిసి ఆమె గిరిజన వేషధారణలో కనిపించారు. పార్టీ నేతలతో కలిసి ఆమె ఉత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
Share this article in your network!