బిజెపికి వ్యతిరేకంగా బలమైన కూటమి అవసరం : సీపీఐ నారాయణ
దసరా నాటికి టిఆర్ఎస్ అధ్యక్షులు కెసిఆర్ కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బిజెపి వ్యతిరేక కూటముని బలపరిచే విధంగా ఉండాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సూచించారు. మతోన్మాదాన్నీ ప్రేరేపిస్తూ, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడం, ఫెడరల్ వ్యవస్థను, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరమని అన్నారు. ఈ తరుణంలో బిజెపికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేకమంది ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ తో సహా అన్ని జాతీయ పార్టీలు ముందుకు వస్తున్నాయని, ఇందుకు కేసీఆర్ కూడా ముందుకు రావడం సమర్థనీయమన్నారు. కెసిఆర్ ప్రకటించబోయే జాతీయ పార్టీ బిజెపికి వ్యతిరేకంగా పోటీ పడాల్సి ఉందని, బిజెపి వ్యతిరేక కూటమి బలపడే విధంగా టిఆర్ఎస్ జాతీయ పార్టీ అడుగులు వేస్తే మంచిదని, దాన్ని సిపిఐ స్వాగతిస్తుందని నారాయణ అన్నారు.
Share this article in your network!