కళ్ల జోడు పెట్టుకున్న ఫొటో షేర్ చేసి.. తన ప యసైపోయిందంటూ కేటీఆర్ ట్వీట్
కళ్ల జోడు పెట్టుకున్న ఫొటో షేర్ చేసి.. తన పయసైపోయిందంటూ కేటీఆర్ ట్వీట్
కళ్ల జోడు పెట్టుకున్న ఫొటో షేర్ చేసి.. తన పయసైపోయిందంటూ కేటీఆర్ ట్వీట్
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. కార్యాలయంలో కళ్ల జోడు పెట్టుకొని కంప్యూటర్ స్ర్కీన్ చూస్తున్న ఫొటో షేర్ చేశారు. కళ్ల జోడు పెట్టుకునేందుకు మొన్నటిదాకా ఇష్టపడలేదని చెప్పారు. కానీ, ఇప్పుడు అవి లేకుండా చదవలేకపోతున్నానని తెలిపారు. ఈ లెక్కన తన వయసైపోయిందని అధికారికంగా చెప్పొచ్చు అని చమత్కరించారు.
ఈ ట్వీట్, ఫొటో చూస్తుంటే ఆయనకు సైట్ వచ్చినట్టు అర్థం అవుతోంది. మంత్రి కేటీఆర్ ఇప్పటిదాకా కళ్ల జోడు ధరించి బయట కనిపించింది లేదు. విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు. ఇప్పుడు కళ్ల జోడును తన ఆఫీస్ వరకే పరిమితం చేస్తారో? లేదంటే బయట కూడా పెట్టుకొని కనిపిస్తారేమో చూడాలి.
Share this article in your network!