తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. నిన్న ఒక్కరోజే 74,128 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 36,053 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా నమోదైంది. నిన్నటి రోజున హుండీ ద్వారా రూ.3.58 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు తదితర సౌకర్యాలు అందిస్తున్నారు.
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ..




