Saturday, June 20, 2026

బండి భగీరథ్‌కు ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

Must read

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు నెల రోజులుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌కు మల్కాజ్‌గిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న భగీరథ్ మే 17న పోలీసుల ముందు లొంగిపోయాడు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురికాగా, తాజాగా ఇంజినీరింగ్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం భగీరథ్ త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!