Saturday, June 13, 2026
Google search engine
HomeHot this Weekతెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించింది టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే: కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించింది టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే: కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతి పెద్ద పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నది టీడీపీ, బీఆర్ఎస్ లే అని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు వరంగల్ లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ ఎల్కతుర్తిలో 1,200 ఎకరాల్లో పార్కింగ్ తో పాటు బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. 3 వేల బస్సులు ఇవ్వాలని ఆర్టీసీని కోరామని… ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. బీఆర్ఎస్ చరిత్రలోనే ఈ సమావేశం అతిపెద్ద సమావేశం అవుతుందని చెప్పారు. 

బహిరంగ సభ తర్వాత కార్యకర్తలు, విద్యార్థుల సభ్యత్వాలను నమోదు చేస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని తెలిపారు.

రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను వేసుకుంటామని… ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తలకు శిక్షణ సమావేశాలు ఉంటాయని కేటీఆర్ చెప్పారు. 12 నెలల పాటు ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బహిరంగసభకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతిని పొందుతామని చెప్పారు.

మాజీ సీఎం కేసీఆర్ ను కేసుల్లో ఇరికించడం గురించే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. లగచర్లలో రైతులు నిరసన చేశారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కూడా విద్యార్థులే ఉద్యమం చేశారని అన్నారు. 

విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. హెచ్ సీయూ భూముల్లో 100 ఎకరాలను చదును చేయడం వల్ల జంతువులు రోడ్ల మీదకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రధాని మోదీ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు

మాతృభూమి సేవలో నిత్యం అంకితభావంతో పనిచేస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం, నిరంతర శక్తి ప్రసాదించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర...

Related Articles

భారత్‌ను విశ్వగురువుగా నిలబెడతారని బండి సంజయ్ విశ్వాసం

భారత రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త అధ్యాయాన్ని లిఖించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

ప్రధాని మోదీ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు

మాతృభూమి సేవలో నిత్యం అంకితభావంతో పనిచేస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం, నిరంతర శక్తి...

రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారు :బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపణ

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసేందుకు ప్రయత్నించానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి...

పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నం.. ప్రభుత్వంపై కవిత ఆరోపణలు

తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై...

రేవంత్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు.. ‘మీ స్ఫూర్తి హిట్లర్’ అంటూ ఫైర్

ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ తీవ్రస్థాయిలో స్పందించారు....

సింగరేణి నిల్వల్లో భారీ వ్యత్యాసం.. న్యాయ విచారణ కోరిన కేటీఆర్​

సింగరేణిలో భారీ స్థాయిలో బొగ్గు కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు రాజకీయ...

అనారోగ్యంతో ఉన్న దేవ్‌జీని పరామర్శించిన కల్వకుంట్ల కవిత

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని తెలంగాణ రక్షణ...

పవన్ సభకు భయపడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్: బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు

తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న సభ చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో...
error: Content is protected !!