Thursday, June 25, 2026

రామ్ చరణ్‌ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అన్న ప్రధాని మోదీ.. తండ్రిగా గర్వంగా ఉందన్న చిరంజీవి

Must read

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రశంసలు మెగాస్టార్ చిరంజీవికి అపారమైన ఆనందాన్ని కలిగించాయి. తన కుమారుడిని ప్రధాని మోదీ ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అని సంబోధించడంపై చిరంజీవి భావోద్వేగంతో స్పందించారు. ఒక తండ్రిగా ఎంతో గర్వంగా ఉందంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి సుమతీ శతకంలోని ప్రసిద్ధ పద్యాన్ని గుర్తుచేశారు.

“పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడే పుట్టదు..
జనులా పుత్రుని గనుగొని పొగడగా
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ”

అనే పద్యాన్ని ప్రస్తావిస్తూ.. కొడుకు జన్మించినప్పుడు మాత్రమే కాదు, అతని ప్రతిభను ప్రపంచం గుర్తించి ప్రశంసించినప్పుడు తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుందని చిరంజీవి పేర్కొన్నారు.ఇటీవల విడుదలైన ‘పెద్ది’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్, రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, రామ్ చరణ్ ప్రతిభను ప్రశంసిస్తూ ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అని అభివర్ణించారు.దేశ ప్రధాని పాల్గొన్న వేదికపై తన కుమారుడికి ఇంతటి గౌరవం లభించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చిరంజీవి తెలిపారు. కృషి, పట్టుదల, అంకితభావంతో రామ్ చరణ్ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.రామ్ చరణ్ తన ప్రతిభతో మరిన్ని విజయాలు సాధించాలని, తెలుగు సినిమా ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచాలని చిరంజీవి ఆకాంక్షించారు.చిరంజీవి చేసిన ఈ భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా అభిమానులు తండ్రి కొడుకుల అనుబంధాన్ని ప్రశంసిస్తూ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!