మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల SIR అవగాహన వర్క్‌షాప్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. SIR ప్రక్రియపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అనవసర భయాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రతి బీజేపీ కార్యకర్త ఈ ప్రక్రియలో బాధ్యతతో, గంభీరతతో పనిచేయాలని సూచించారు. SIR అనేది ఓటరు జాబితాను స్వచ్ఛంగా, పారదర్శకంగా, కచ్చితత్వంతో రూపొందించేందుకు చేపట్టే ఎన్నికల రోల్ శుద్ధి ప్రక్రియ మాత్రమేనని వివరించారు. అక్రమ ఓట్లు తొలగించి, నిజమైన అర్హులైన ఓటర్లకు న్యాయం జరిగేలా ఈ ప్రక్రియ దోహదపడుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి స్వచ్ఛమైన ఓటరు జాబితా ఎంతో అవసరమని పేర్కొన్నారు. SIRపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మహేందర్, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు.
SIR ప్రక్రియపై తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి: ఎన్. రాంచందర్ రావు




