రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్‌ను వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డా. కె. లక్ష్మణ్‌కు లభించిన ఈ ప్రతిష్టాత్మక బాధ్యత ఆయన సుదీర్ఘ ప్రజాసేవ, సమర్థవంతమైన నాయకత్వం, జాతీయ భావజాలం, పార్టీ పట్ల అంకితభావానికి గుర్తింపు అని పేర్కొన్నారు. తెలంగాణ గొంతుకగా, సనాతన ధర్మ పరిరక్షణకు, సామాన్య ప్రజల సాధికారతకు డా. కె. లక్ష్మణ్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన రాజకీయ ప్రయాణం దేశవ్యాప్తంగా లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని క్యానం రాజ్యలక్ష్మి ఆకాంక్షించారు.
రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా డా. కె. లక్ష్మణ్ నియామకం.. శుభాకాంక్షలు తెలిపిన క్యానం రాజ్యలక్ష్మి




