Homeట్రేండింగ్తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించింది టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే: కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించింది టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే: కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతి పెద్ద పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నది టీడీపీ, బీఆర్ఎస్ లే అని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు వరంగల్ లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ ఎల్కతుర్తిలో 1,200 ఎకరాల్లో పార్కింగ్ తో పాటు బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. 3 వేల బస్సులు ఇవ్వాలని ఆర్టీసీని కోరామని… ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. బీఆర్ఎస్ చరిత్రలోనే ఈ సమావేశం అతిపెద్ద సమావేశం అవుతుందని చెప్పారు. 

బహిరంగ సభ తర్వాత కార్యకర్తలు, విద్యార్థుల సభ్యత్వాలను నమోదు చేస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని తెలిపారు.

రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను వేసుకుంటామని… ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తలకు శిక్షణ సమావేశాలు ఉంటాయని కేటీఆర్ చెప్పారు. 12 నెలల పాటు ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బహిరంగసభకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతిని పొందుతామని చెప్పారు.

మాజీ సీఎం కేసీఆర్ ను కేసుల్లో ఇరికించడం గురించే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. లగచర్లలో రైతులు నిరసన చేశారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కూడా విద్యార్థులే ఉద్యమం చేశారని అన్నారు. 

విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. హెచ్ సీయూ భూముల్లో 100 ఎకరాలను చదును చేయడం వల్ల జంతువులు రోడ్ల మీదకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

Related Articles

ఎన్. శంకర్ విజన్.. వెంకటేష్ నటన.. 26 ఏళ్ల ‘జయం మనదేరా’

కొన్ని సినిమాలు హిట్ అవుతాయి.. కొన్ని సినిమాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.. మరికొన్ని సినిమాలు ఒక తరం సినీ ప్రయాణంలో...

సైబర్ నేరగాళ్లపై TGCSB మెగా ఆపరేషన్.. 101 మంది అరెస్ట్

సైబర్ నేరాలకు ఆర్థికంగా, సాంకేతికంగా సహకరిస్తున్న ముఠాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) భారీ ఆపరేషన్ చేపట్టింది....

మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్‌పై సర్కారు పునరాలోచన..

హైదరాబాద్: నగర ప్రజా రవాణాలో కీలక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్ విధానంపై ప్రభుత్వం...

25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. ప్రజలకు మోదీ కృతజ్ఞతలు

ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల నిరంతర ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృతజ్ఞతలు...

డాక్టర్ తార్యా నాయక్ అరెస్ట్.. పోక్సో చట్టం కింద కేసు

హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రైనీ నర్సుగా పనిచేస్తున్న 17...

హీరో నుంచి డైరెక్టర్‌గా.. ‘రియాలిటీ’తో కిరణ్ అబ్బవరం కొత్త అవతారం!

టాలీవుడ్‌ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగా...

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

భారతీయ సినీ పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాలకు కొత్త అర్థం చెప్పిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. 94...

నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. లాల్ బహదూర్ శాస్త్రి

భారత స్వాతంత్య్రానంతర రాజకీయ చరిత్రలో నిరాడంబరత, నిజాయితీ, అంకితభావానికి ప్రతీకగా నిలిచిన మహానేత లాల్ బహదూర్ శాస్త్రి. అక్టోబర్...
error: Content is protected !!