ఐఐటీ గౌహతి లో గత 6 రోజులలో 60 మందికి పైగా కోవిడ్ పాజిటివ్ రావడంతో అధికారులు క్యాంపస్ మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకంటించారు. క్యాంపస్ లోనికి ఎవరూ ప్రవేశించడానికి లేకుండా, అలాగే లోపల ఉన్నవారు ఎవరూ కూడా బయటకు రావడానికి లేకుండా ఆంక్షలు విధించామని డెప్యూటీ కమిషనర్ తెలిపారు. 

విద్యార్థులకు క్లాసులు కూడా సస్పెండ్ చేయబడ్డాయి. పాజిటివ్ గా వచ్చిన విద్యార్థులను గెస్ట్ హౌస్ లో క్వారంటైన్ చేసారు. పాజిటివ్ గా వచ్చిన ఇతర స్టాఫ్ ను గౌహతి మెడికల్ కాలేజి ఆసుపత్రి లో అడ్మిట్ చేసారు. 

అస్సాం లో గత వారం రోజులలో కోవిడ్ ఉగ్ర రూపం దాల్చింది. పాజిటివ్ కేసులు 5 రెట్లు పెరిగాయి. 2 మందికి కొత్తగా వచ్చిన ఓమిక్రాన్ సోకినట్టు అధికారులు తెలిపారు. 

ఈ మేరకు అతివేగంగా పరిస్థితిని పరిశీలిస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. లాక్ డౌన్ విధించడం సరికాదనీ , అన్ని విధాలుగా కావలిసిన వైద్య సౌకర్యాలను సిద్ధం చేస్తామని అన్నారు.