అసోం సీఎం పై రేవంత్ ఫైర్
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మహిళలను అవమానించారని టీపీసీసీ చీఫ్ రవేంత్ రెడ్డి అన్నారు. అసోం సీఎంపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అధికారులు ఆయన మీద క్రిమినల్ కేసులు పెడతారని ఆశించామని… ప్రధాని నిస్సిగ్గుగా బిశ్వ శర్మ ను సమర్ధిస్తున్నారని మండిపడ్డారు. అసోం సీఎంపై చర్యలు తీసుకోవడంలో అసోమ పోలీస్, ఎన్నికల వ్యవస్థలు విఫలం అయ్యాయన్నారు. బిశ్వ శర్మ వ్యాఖ్యలతో దేశంలోని మాతృమూర్తులకు అవమానం జరిగిందని తెలిపారు
Share this article in your network!