మెగాస్టార్ మూవీలో అనుష్క
మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. ఈ నేపథ్యములో 'ఆచార్య' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. 'గాడ్ ఫాదర్', 'భోళాశంకర్' సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా, భీష్మ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల తో ఒక సినిమా చేయనున్నారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించనుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకున్న అనుష్క.. కొంతకాలంగా సినిమాలు తగ్గించింది. బాహుబలి తర్వాత కొన్ని సినిమాలలో మాత్రమే కనిపించింది. ప్రస్తుతం కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి తో ఒక సినిమాలో నటిస్తుంది. చిరంజీవి, వెంకీ కుడుముల కాంబినేషన్ తో తెరకెక్కనున్న మూవీలో మొదట శ్రుతిహాసన్ అనుకోగా చివరకు అనుష్క ఆ ఛాన్స్ కొట్టేసింది.
Share this article in your network!