నారా చంద్రబాబు నాయుడు కు కరోనా పాజిటివ్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు నిర్ధారించారు. తేలికపాటి లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్ లో ఉండిపోయారు.
సోమవారం ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తేల్చారు.
మరోవైపు టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ప్రత్యేకంగా నిర్వహించనున్న కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉండగా పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు వంటి సేవకార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించుకుంది.
Share this article in your network!