టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావు పోలీసులు అరెస్టు చేయ‌డం అల‌జ‌డి రేపుతోంది. అశోక్ బాబును క‌లిసేందుకు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో వారితో దేవినేని ఉమ గొడ‌వ పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను అరెస్టు చేశారు. 

TDP సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి అరెస్ట్ చేసిన టిడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును కలవడానికి సీఐడీ ఆఫీస్ వద్దకు వెళ్తున్న సమహంలో ఉమ సహా పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన టిడిపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును కలవడం కోసం దేవినేని ఉమ సహా టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్, పిల్లి మాణిక్యరావు, సుఖవాసి, కనపర్తి వంటి నేతలతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు గుంటూరులోని సీఐడీ ఆఫీసుకు వెళ్ళారు. అయితే సీఐడీ ఆఫీసులోకి వెళ్తున్న పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. అశోక్‌బాబును కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై ఉమా మండిపడ్డారు. పోలీసులు వెంటనే ఉమా పాటు ఇతర నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.