40 లక్షల మంది జీవితాలను చిధ్రం చేస్తున్న నిరుద్యోగ సమస్యను సామాజిక, ఆర్ధిక సమస్యగా గుర్తించి వెంటనే 'నిరుద్యోగ ఎమర్జెన్సీ' ప్రకటించాలి : ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ 

*వివిధ జాతీయ స్థాయీ పారిశ్రామిక వేత్తలతో, అకాడమీషియన్స్ తో, మేధావులు, వ్యూహకర్తలు, విద్యావంతులు, పాలసీ మేకర్స్ తో, "ఉన్నతస్థాయి స్పెషల్ టాస్క్ ఫోర్స్" ఏర్పాటు చేసి, తెలంగాణ స్థితిగతులకు అనుగుణమైన నిర్దిష్టమైన విధి విధానాలతో కూడుకున్న వ్యూహాన్ని తయారు చేయాలి. 

  • ఇది సామజిక సమస్య, అంచేత అన్ని రాజకీయ పార్టీలతో "అత్యవసర అఖిల పక్ష సమావేశాన్ని" నిర్వహించాలి.
  • 2018 ఎన్నికల సందర్బంగా మీరు వాగ్దానం చేసినట్లుగా, 2019 వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కేటాయించిన 1800 కోట్ల రూపాయల నిధులను కోన సాగిస్తూ, వెంటనే, Rs 3001/- ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగభృతి అందచేయాలి.
  • ప్రతి మండల కేంద్రాల్లో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు, ఉపాధి లభించే విధంగా శిక్షణ, మరియు ప్రైవేట్ సెక్టార్ కంపెనీల సహకారంతో, ఉద్యోగ మేళాలు నిర్వహించాలి.
  • ప్రభుత్వ ఉద్యోగాలలో, 95% స్థానికులకు రిజర్వేషన్స్ ఇచ్చినట్లుగా, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలలో కూడా 95% తెలంగాణ స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా చట్టం చేయాలి, అమలు చేయని కంపెనీలపై తగు చర్యలు తీసుకోవాలి. *ఎస్సి, ఎస్టీ, బీసి, మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్స్ లో లక్షల కొద్ది లోన్ అప్లికేషన్స్ పెండింగ్ లో వున్నాయి. వెంటనే వారికి ఈ లోన్స్ ని అండ చేసి, వారికి సెల్ఫ్ ఎంప్లామెంట్ కలిగించి వారికాళ్ళపై వారు నిలబడే విధంగా చర్యలు తీసుకోవాలి.
  • 7651 ఫీల్డ్ అసిస్టెంట్లు తమ హక్కులని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నిరసన తెలిపారనే కోపంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ దుశ్చర్య వలన దాదాపు 70 మంది చనిపోయారు. ఏదేమైనా రెండేళ్ళు తర్వాత మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మీ నిర్ణయానికి సంతోషిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ మీ చర్యవలన సర్వం కోల్పోయిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ రెండేళ్ళ జీతాన్ని చెల్లించాలి. అలాగే చనిపోయిన 70మందికి కోటి రూపాయిలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. 

*ఈ మధ్యకాలంలోప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకపొగా, ఉన్న ఉద్యోగాలు ఊడపీకిన్రు. 7651 ఫీల్డ్ అసిస్టెంట్లతో కలుపుకుని, మొత్తం 52,515 మంది ఉద్యోగులని ప్రభుత్వం తొలగించింది. వీరిందరిని మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి. 

* ఈ రాష్ట్రంలో దాదాపు 40లక్ష మంది నిరుద్యోగులు వున్నారు. తమరు ప్రకటించిన 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలతో ఈ సమస్య పరిష్కారం కాదు. 10 జిల్లాలు ఉన్నప్పుడు 4.91 లక్షలు సాంక్షన్డ్ పోస్టులున్నప్పుడు, 33 జిల్లాలకు ఇంకా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి. 

 

40లక్షల మంది తెలంగాణ ప్రజలు నిరుద్యోగంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కార మార్గం యుద్దప్రాతిపదికన చేపట్టేటందుకు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జన్సీ ప్రకటించాలి’’ అని డిమాండ్ చేశారు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసిన దాసోజు గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడారు దాసోజు.
’తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కోసం, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం పుట్టింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు.. ఉద్యమ ఆకాంక్షని దెబ్బతీస్తూ ఉద్యోగాలు కల్పించకపోగా నిరుద్యోగ సమస్యని మహమ్మారిలా తయారుచేసింది కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి ఈ సమస్య పరిస్కారినికి వెంటనే నిరుద్యోగ ఎమర్జన్సీ ప్రకటించి సత్వర చర్యలు తీసుకోవాలి. ’’ అని డిమాండ్ చేశారు దాసోజు. 

గత ఎనిమిదేళ్ళగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన కేసీఆర్ .. ఎట్టకేలకు 90 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెబుతున్నారు. అయితే బిశ్వాల్ కమిటీ 1లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలు వున్నాయని చెప్పింది. కానీ కేసీఆర్ మాత్రం 90 వేల ఉద్యోగాల ప్రకటన చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. బిశ్వాల్ కమిటీ లెక్క ప్రకారం మిగతా లక్ష ఉద్యోగాలు ఎవరు భర్తీ చేయాలి ? గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఒక మహమ్మారిలా పెరిగింది. దాదాపు 40లక్షల మంది నిరుద్యోగులు వున్నారు. కేసీఆర్ మాత్రం 90 వేల ఉద్యోగాలు భర్తీ అని ప్రకటన చేశారు. మరి మిగతా 39 లక్షల మంది నోట్లో మన్ను కొడతారా ? వారిని ఎవరు ఆదుకుంటారు ? వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై లేదా ? ఈ సమస్య పరిష్కారం కావాలంటే నిరుద్యోగ ఎమర్జన్సీ ప్రకటించి, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి లోతైన చర్చ జరిపి సత్వరంగా పరిష్కార మార్గాలు చూపాలి’’ అని డిమాండ్ చేశారు దాసోజు. 

గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నపుడు ప్రైవేట్ సెక్టార్లతో సంప్రదింపులు జరిపి ఉద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అజీం ప్రేమ్ జీ , మైహోమ్ రామేశ్వరావు ..ఇలా చాలా మంది వ్యాపారవేత్తలు, ప్రముఖులతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం కోసం లోతైన అధ్యయనం చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి నిరుద్యోగ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కార మార్గాలు కనుక్కోవాలి.’’ సూచించారు దాసోజు 

‘’సిఏం కేసీఆర్ నిరుద్యోగ బృతి హామీ, ఇంకా హామీగానే వుంది. నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు యుద్ద ప్రాతిపదికన అందరినీ నిరుద్యోగ బృతి ఇవ్వాలి. అందరికి ప్రభుత్వం వుద్యోగం ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. అయితే ప్రతి మండల కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువత స్కిల్ డెవలప్ చేసి వేరే చోట కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు ప్రధానంగా ప్రైవేట్ సెక్టార్ లో కూడా 95శాతం రిజర్వేషన్ కల్పించి స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోండి’’ అని డిమాండ్ చేశారు దాసోజు. 

‘’ఎస్సి, ఎస్టీ, బీసి, మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్స్ లో లక్షల కొద్ది లోన్ అప్లికేషన్స్ పెండింగ్ లో వున్నాయి. వుద్యోగం ఇవ్వడం లేదు. అటు లోన్స్ కూడా క్లియర్ చేయడం లేదు. దీంతో సొంత కాళ్ళపై నిలబడాలనే యువత నిరాశ నిస్పృహ గురౌతుంది. వెంటనే ఈ లోన్స్ ని క్లియర్ చేసి వారికి సెల్ఫ్ ఎంప్లామెంట్ కలిగించి వారికాళ్ళపై వారు నిలబడే విధంగా చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు దాసోజు 

7951 ఫీల్డ్ అసిస్టెంట్లు తమ హక్కులని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నిరసన తెలిపారనే కోపంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. కేసీఆర్ అహంకారపూరిత చర్యవలన దాదాపు 70 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు చనిపోయారు. కొందరు భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు వుద్యోగం లేదనే ఆత్మనూన్యతో, జీతంలేక, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక, కుటుంబాన్ని పోషించలేక, భవిష్యత్ పై అందోళనతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మెజారిటీ బిసి, ఎస్సి, ఎస్టీ బిడ్డలే వున్నారు. ఇలాంటి వారిపట్ల రెండేళ్ళు ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించింది. ఏదేమైనా రెండేళ్ళు తర్వాత మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అయితే వారు కోల్పోయిన జీవితాన్ని ఎవరు తిరిగి ఇస్తారు? వారికి కలిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి ? కాబట్టి రెండేళ్ళ జీతాన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు చెల్లించాలి. అలాగే చనిపోయిన 70మందికి కోటి రూపాయిలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. 

52,515 మంది ఉద్యోగులని ప్రభుత్వం తొలగించింది. స్వర్వ శిక్ష అభియాన్ లో 21200 మంది, కోవిడ్ కాలంలో పని చేసిన నర్సులు1640, మిషన్ భగీరదలో 709, హార్టికల్చర్ 315, ఉద్యావలీంటీర్లు 16, 400మంది, జూనియర్ పంచాయితీ కార్యదర్శకులు 2000మంది, సోషల్ వెల్ఫేర్, విధ్యాశాఖ. ఆర్టీసి చెందిన 2640మంది ఉద్యోగులని తొలగించారు. వెరసి.. 44, 884 మంది ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు. వీరిందరిని మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. 

''నిరుద్యోగం అనేది ఒక మహమ్మారి. నిరుద్యోగ సమస్య వల్ల, లక్షలమంది నిరుద్యోగులు, వారి కుటుంబాలు ఆత్మన్యూనతా భావంతో కొట్టుమిట్టాడుతూ, అనేక మంది, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంచేత వెంటనే "నిరుద్యోగ ఎమర్జెన్సీ" ని ప్రకటించి, యుద్ద ప్రాతిపదికన నిర్దిష్టమైన పరిష్కార మార్గం కనుక్కోవాలి' అని మనవి శేశారు దాసోజు. ఈ సమావేశంలో తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, టీపీసీసీ సెక్రటరీ తాహేర్ సాధి, కాంగ్రెస్ నాయకులు విజయ్ పాల్గొన్నారు.