రామాయంపేట జంట ఆత్మహత్యల కుటుంబాన్ని బీజేపీ నేతలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, వివేక్ లు పరామర్శించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ..తెలంగాణలో జరుగుతున్నవి ఆత్మహత్యలు కావు ప్రభుత్వ హత్యలన్నారు. ప్రగతి భవన్ లో కూర్చొని..  టీఆర్ఎస్ నాయకులకు ఏమన్నా చేసుకోండి కేసులు ఉండవు అని కెసిఆర్ చెప్పడమే దీనికి కారణమని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి.. ఆర్థిక దిగ్బంధం చేసి.. లొంగ దీసుకుంటున్నారని మండిపడ్డారు. అధికార పార్టీకి గులాం గిరీ చేస్తున్నారా ? అని డీజీపీని ప్రశ్నించారు ఈటల.