కిషన్ రెడ్డి పై మంత్రి గంగుల ఆగ్రహం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత రాష్ట్రంపై విషయం చిమ్మేలా, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా విమర్శలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తెలంగాణ వ్యాపారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా డిల్లీ వేదికగా రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజలను అవమానపర్చే విదంగా మాట్లాడారని అన్నారు. నూకలు బుక్కుతవా అని అవమానించిన పియూష్ గోయల్ మన రాష్ట్రం కాదు, కానీ తెలంగాణ ప్రజల ఓట్లతో డిల్లీ గద్దెపై కూసొని తెలంగాణ ప్రజల్ని అవమానించేలా కిషన్ రెడ్డి మాట్లాడారని అన్నారు. ఎఫ్ సిఐ, సివిల్ సప్లయ్స్ విషయాలపై కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు.
Share this article in your network!