బత్తుల బ్రహ్మనందరెడ్డి కి ఘన సన్మానం
స్టానిక వై. యస్. ఆర్ పార్టీ కార్యాలయం నందు, బత్తుల బ్రహ్మనందరెడ్డి ని పలువురు ప్రముఖ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. నీతి,నిజాయితీకి మారు పేరు మన బత్తుల అని కోనియాడారు. సన్మాన కార్యక్రమములో పాల్గోన్న ప్రముఖలలో కనిగిరి నియోజక వర్గ శాసన సభ్యులు బుర్రా మాధవ రావు పాల్గోని అభినందించారు.
మధ్య పాన విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ రెడ్డి పాల్గోని, సుధీర్గ రాజకీయ అనుభవం కలిగిన బ్రహ్మానందరెడ్డికి సహకార మార్కేటింగ్ పోస్టు రావటం అభినందనీయమనీ అన్నారు.
రాష్ట్ర బి. సి సేల్ నాయకులు బోర్లా రామారావు మాట్లాడుచూ, బ్రహ్మనందరెడ్డి గారు, జగన్ మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర ప్రకాశం జిల్లా లో రూప కల్పనకు, మోదటి సూత్ర దారి అని కోనియాడారు.
ఇంకా ఈ కార్యక్రమములో ఓంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, మరియు వై. సి. పి కార్యకర్తలు పాల్గోని బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారిని సన్మానించారు.
Share this article in your network!