మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్రంలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం
అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే ధ్యేయంగా.. నా డ్వాక్రా అక్క చెల్లెమ్మలను నిజమైన వ్యాపార వేత్తలుగా మార్చాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టంలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. పేద అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక సాధికార కల్పించి, వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా సున్నావడ్డీకే రుణాలు అందించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరడమే మన ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ వివిరంచారు. డా. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గన్నారు. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ఉన్న 9.48 లక్షల డ్వాక్రా సంఘాల్లోని 1,05,13, 365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీ నిధులను రీయింబర్స్మెంట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకుండా, వారి తరపున ఆ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే స్వీకరించి “వైఎస్సార్ సున్నా వడ్డీ" కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం భరిస్తోందన్నారు. ఇవాళ నాలుగో విడతగా.. అందిస్తున్నరూ. 1,353.76 కోట్లతో కలిపి “వైఎస్సార్ సున్నావడ్డీ" కింద ఇప్పటి వరకు అందించిన మొత్తం సాయం రూ. 4,969.05 కోట్లు అని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికే మూడు విడతల్లో డబ్బులు జమ చేశామన్నారు.
మన ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా, వారి జీవనోపాధి మెరుగుపరుస్తూ.. బహుళ జాతి, దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటున్నారని సీఎం జగన్ పేరర్కొన్నారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం చొరవతో బ్యాంకులలో వడ్డీ రేట్లు తగ్గింపజేయడంతో అక్కచెల్లెమ్మలపై ఏకంగా రూ. 1,224 కోట్ల మేర వడ్డీ భారం తగ్గిందని సీఎం తెలిపారు. ప్రభుత్వ సహకారంతో పశువుల కొనుగోలు, కిరాణా దుకాణాలు, వస్త్ర వ్యాపారాల వంటి వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న 16,44,029 మంది అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.7 వేల నుంచి 10 వేల వరకు అదనపు ఆదాయం పెరిగిందన్నారు. అమూల్ తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ.20 వరకు అదనపు ఆదాయం కూడా లభిస్తోందన్నారు.
నారా చంద్రబాబు నారీ వ్యతిరేక చరిత్ర ఇదీ..
చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య పొదుపు సంఘాలకు రూ. 14,205 కోట్లు చెల్లించకుండా అక్క చెల్లెమ్మలను మోసం చేశారని సీఎం జగన్ విమర్శించారు. 2016లో సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేసి డ్వాక్రా సంఘాలను నడి రోడ్డుపైకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి మిగిలిచ్చిన అప్పులన్నీ 2019 ఏప్రిల్ నాటికి రూ.25,571 కోట్లకు ఎగబాకాయని వీటిలో 18.36 శాతం మొండి బకాయిలుగా ఉన్నాయని బ్యాంకులు తేల్చాయని సీఎం జగన్ పేర్కన్నారు. ఆ రోజుల్లో నారా చంద్రబాబు నారీ వ్యతిరేక చరిత్ర రాశారని సీఎం జగన్ చంద్రబాబుకు చురకలు అంటించారు. అప్పులు తడిసి మోపెడై పొదుపు సంఘాలు నిర్వీర్యమైన పరిస్థితిని రాష్ర్టంలో తెచ్చారని విమర్శించారు.
మన సంక్షేమ ప్రభుత్వంలో వెలుగుతున్న డ్వాక్రా సంఘాలు
గత ప్రభుత్వం హయాంలో 90 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో ఉంటే.. ప్రస్తుతం 1.16 కోట్ల మంది అక్క చెల్లెమ్మలు పొదుపు సంఘాల్లో ఉన్నారని సీఎం జగన్ తెలిపారు. ఈ నాలుగేళ్లలో మహిళల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. అక్కచెల్లెమ్మలు బాగుండాలి, వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్నారు. ఇలాంటి పథకాలు గతంలో ఎప్పుడూ చూసింది లేదు, దేశంలోనే ఎక్కడా అమలు చేసిన దాఖలాలు లేవని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో సంక్షేమ పథకాలతో ఎంత మంచి జరిగిందో సీఎం జగన్ వివరించారు. మహిళలు రాజకీయంగా కూడా ఎదగాలని, నామినేటెడ్ పదవులు, పనుల్లో చట్టం చేసి అమలు చేస్తున్న ప్రభుత్వం మనదని తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి దిశ చట్టం తీసుకొచ్చాం. మహిళలు సాధికారత సాధించాలని బలంగా నమ్మి చేస్తున్న కార్యకరమాలు ఇవన్నీ అని ఆయన పేర్కొన్నారు.
పేద బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు, దత్తపుత్రుడు ఏనాడైనా ఆలోచించారా..
చంద్రబాబు అధికారంలో ఉన్న రోజుల్లో ఇన్ని సంక్షేమ పథకాలు పక్కాగా అమలు కావడం ఎప్పుడైనా చూశారా? ఇన్ని డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కావడం ఎప్పుడైనా ఇచ్చారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఎప్పుడైనా ఆలోచన చేశారా.. అదే మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేద బిడ్డల కోసం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తానంటే చంద్రబాబు దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని సీఎం జగన్ విమర్శించారు. ఏనాడైనా ఇంత మందికి చంద్రబాబు ఇళ్ల పట్టాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఈ ముసలాయన పేరు వింటే.. ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా అని చంద్రబాబు నుంచి ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడగా.. సభలో ఉన్న ప్రజలు పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
క్యాడర్ ను రెచ్చగొట్టి పుంగనూరులో చంద్రబాబు రావణకాష్టం
చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం క్యాడర్ ను పోలీసులు, ప్రజల ఆస్తులపై రెచ్చగొట్టి రావణ కాష్టం సృష్టించారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం క్యాడర్ ను రెచ్చగొట్టడం వల్ల స్థానిక గొడవల్లో 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఓ పోలీసు సోదరుడికి కన్నుపోయిందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారురు. ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తెచ్చిన వాలంటీర్ వ్యవస్థపై కూడా చంద్రబాబు, దత్తపుత్రుడు నీచమైన ఆరోపణలు చేయడం దారుణమన్నారు. మహిళల కోసం తెచ్చిన ఒక్క దిశ యాప్ ద్వారానే 30,369 మంది మహిళలను రక్షించామని, ఈ విషయం దత్తపుత్రుడికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహిళలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నా వారికి నా అక్క చెల్లెమ్మలే సరైనా సమాధానం చెబుతారన్నారు.
ఎన్నికల సమీపిస్తుండటంతో రానున్న రోజుల్లో చంద్రబాబు, దత్తపుత్రుడు ఇలాంటి అబద్దాలు చాలా చెబుతారని, ఎవరూ మోసపోవద్దని సీఎం జగన్ సూచించారు. దత్తపుత్రుడు ఎలాగైనా చంద్రబాబును సీఎం చేయాలని తప్పుడు ఆరోపపణలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. వారికి అధికారం ఇస్తే.. గిట్టనివారి అంతుచూస్తారట, రాజకీయం అంటే ఇదేనా అని సీఎం జగన్ ప్రశ్నించారు. సొంతపుత్రుడు, దత్తపుత్రుడు, చంద్రబాబు అందరూ కలిసి రాష్ర్టాన్ని దోచుకోవాలని ప్రజలు జాగ్రత్తుగా ఉండాలని సూచించారు. దళితులను విడగొట్టి చంద్రబాబు వారికి నరకం చూపించారు, బీసీల తోకలు కత్తిరిస్తా అన్నారు, మైనార్టీలు, ఎస్టీలకు మంత్రి పదవి ఇవ్వకుండా వారితో చంద్రబాబు ఆడుకున్నాడని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యక్తులకు అధికారం ఇస్తే.. జన్మభూమి కమిటీలతో ప్రజలను లంచాలు, వివక్షలతో పీల్చి పిప్పి చేస్తారని రాష్ర్ట సంపదను జేబుల్లోకి వేసుకుంటారని సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఎల్లోమీడియా దోచుకోవడానికి తప్ప ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేయరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అప్పులు కూడా గతం కంటే తక్కువగానే తెస్తోందని, టీడీపీ హయాంలో ఇంతకంటే ఎక్కువ అప్పులు తెచ్చి చంద్రబాబు ఆనాడు ఎందుకు ఇన్ని పథకాలు ఇవ్వలేకపోయారనే ఒక్క ప్రశ్నకు ప్రజలకు సమాధానం చెప్పాలని సీఎం జగన్ సూచించారు
Share this article in your network!