Tuesday, June 30, 2026

ప్రతి బూత్‌లో కమలం వికసించాలన్న లక్ష్యంతో విజయ సంకల్ప సమ్మేళనం

Must read

ప్రతి బూత్‌లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించిన బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరై బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్‌ను పార్టీకి విజయ కేంద్రంగా మార్చేందుకు కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమ్మేళనంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వేలాది మంది బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజల్లో విస్తృత స్థాయిలో చేరువ కావడంపై నాయకులు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో 137వ డివిజన్‌కు చెందిన బూత్ అధ్యక్షులు, బూత్ లెవల్ అసిస్టెంట్లు సమ్మేళనంలో పాల్గొన్నారు. బీజేపీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి, ప్రతి బూత్‌లో కమలం వికసించేలా కృషి చేస్తామని వారు సంకల్పం వ్యక్తం చేశారు.

Previous article
- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!