వర్షాకాలం ప్రారంభమైయ్యే నేపథ్యంలో కాకతీయనగర్ డివిజన్ పరిధిలోని జేకే కాలనీలో స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులను మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పరిశీలించారు. తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో కాలనీలో వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుమారు రూ.1.34 కోట్ల నిధులు మంజూరు చేయించి స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. డ్రైన్ పనులు త్వరగా చెయ్యాలని ఇంజనీరింగ్ AE సత్యలక్ష్మి కి ఫోన్ చేసి చెప్పారు.
భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిసిల్టింగ్ పనులు వేగవంతం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్ష కాలంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే ఇంజినీరింగ్ సిబ్బందిని కానీ వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ అయిన తనను కానీ సంప్రదించాలి అని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు కాలనీలను సందర్శిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని క్యానం రాజ్యలక్ష్మి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఓం ప్రకాష్ , సాయి సురేష్ , గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
జేకే కాలనీ స్టార్మ్ వాటర్ డ్రైన్‌ను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి




