Friday, June 19, 2026

డబుల్ బెడ్ రూమ్ సమస్యలపై ఎంపీ ఈటలను కలిసిన మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

Must read

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి శామీర్‌పేట్‌లోని ఆయన నివాసంలోని ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో పర్యటించిన సందర్భంగా పలువురు స్థానికులు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు మంజూరు కాలేదని రాజ్యలక్ష్మి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో అర్హులైన వారి పూర్తి వివరాలు, దరఖాస్తుల ఫైళ్లను సేకరించిన రాజ్యలక్ష్మి ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి అందజేశారు. ప్రజల సమస్యలను ఎంపీకి వివరించి, అర్హులైన పేద కుటుంబాలకు న్యాయం జరిగేలా సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన ఈటల రాజేందర్ ఫైళ్లను స్వీకరించి, తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!