Saturday, June 6, 2026
Google search engine

విజయవాడలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్‌పో ప్రారంభం

Must read

విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్‌పోను ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) సతీమణి కేశినేని జానకి లక్ష్మీ ప్రారంభించారు. ఆమె స్టాళ్లను సందర్శించి వివిధ రకాల చేనేత చీరలను పరిశీలించగా, వీవ‌ర్స్‌తో చేనేత ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జానకి లక్ష్మీ మాట్లాడుతూ చేనేత వస్త్రాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని, మహిళలకు చీరలంటే ప్రత్యేకమైన మక్కువ ఉంటుందని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌లో అన్ని రకాల వస్త్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. చేనేత పరిశ్రమను జాతీయ సంపదగా అభివర్ణిస్తూ, దసరా–దీపావళి పండుగల సందర్భంలో ప్రజలు షాపింగ్ చేసి ఎగ్జిబిషన్‌ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. చేనేత వస్త్రాలను ధరించడం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా కళాకారులను ప్రోత్సహించినట్లే అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రదర్శన మూడు రోజులపాటు కొనసాగనుంది.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!