Friday, June 26, 2026

తెలంగాణ హైకోర్టులో హరీష్‌రావు హౌస్‌మోషన్‌ పిటిషన్‌..

Must read

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదిక హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు సభలో కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దంటూ ఆయన హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నివేదికను సభలో ఉంచకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును హరీష్‌రావు కోరారు.అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ ఆయన మాట్లాడుతూ, “మేము కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఈ ప్రభుత్వానికి భయం ఎందుకు? అవకాశం ఇవ్వకపోవడం వాళ్ల భయాన్ని చూపిస్తుంది. వాస్తవాలు వినడానికి కాంగ్రెస్ పార్టీ, శ్రీధర్ బాబు సిద్ధంగా లేరు. నిజాలు తేల్చాల్సింది కోర్టులే” అని వ్యాఖ్యానించారు.రేపటి అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక సమర్పణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!