Friday, June 26, 2026

అత్తగారి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి

Must read

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత లెజెండరీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య అర్ధాంగి కనకరత్నమ్మ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో అల్లు, మెగా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.కుటుంబ పెద్దగా అందరికీ ఆప్యాయత, ధైర్యం అందించిన కనకరత్నమ్మ మృతిపట్ల సినీ వర్గం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. తన అత్తగారి మరణంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. “మా అత్తయ్య గారు, కీ.శే అల్లు రామలింగయ్య గారి అర్ధాంగి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందడం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయి. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః” అని పేర్కొన్నారు.
కనకరత్నమ్మ మృతి వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అల్లు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!